
క్యాచీ లిరిక్స్ తో హిలేరియస్ గా ఉన్న హతవిధీ సాంగ్: ధనుష్ గొంతుతో పాటకు ప్రత్యేక ఆకర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నుండి హతవిధీ అనే సెకండ్ సాంగ్ రిలీజైంది. ఈ పాటలో నవీన్ పొలిశెట్టి పాత్రను పూర్తిగా పరిచయం చేసారు.
తన జీవితంలో జరిగిన విషాదాన్ని ఈ పాటలో చూపించారు. నిజానికి ఇది బ్రేకప్ సాంగ్. కానీ ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ కాబట్టి ఈ పాటను నవ్వులు పంచే విధంగా తీర్చిదిద్దారు.
బుల్లిచీమ బతుకుపై బుల్డోజర్ ఎక్కినట్లు, చిటపటాసు ఫాదరూ, కట్ కటీఫూ లవ్వరూ, నట్ట నడుమన జిందగీ అప్పడమైనదీ అంటూ ప్రతీ లిరిక్ హిలేరియస్ గా సాగింది. లిరికల్ వీడియో ఇంట్రెస్టింగ్, చూడడానికి ఆకర్షణీయంగా ఉంది.
Details
హీరో ధనుష్ పాడిన పాట
తమిళ హీరో ధనుష్ ఈ పాటను పాడారు. ఆయన గొంతులోని మ్యాజిక్ కారణంగా ఈ పాటకు అదనపు అందం వచ్చింది.
ఒకసారి విన్నాక మరోమారు వినాలనిపించేలా ఉంది. పాటలోని విజువల్స్ చూస్తుంటే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నవీన్ పొలిశెట్టి పాత్ర, ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్వు తెప్పించేలా ఉందని అర్థమవుతోంది.
ఈ పాటను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసారు. రధన్ సంగీతం అందించారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో అనుష్క శెట్టి చెఫ్ గా కనిపించనుంది. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నుండి రిలీజైన సెకండ్ సాంగ్
Mr.Polishetty is here to share his sad - bad story with you all… 🥺
— UV Creations (@UV_Creations) May 31, 2023
▶️ https://t.co/JyKDkuCrAf#Hathavidi lyrical video from #MissShettyMrPolishetty out now
Sung by one and only @dhanushkraja sir 🤩@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #RajuSundaram… pic.twitter.com/HjXW04y25t