శ్రీ సింహా ఉస్తాద్ నుండి మెలోడీ సాంగ్ రిలీజ్: పాట ఎలా ఉందంటే?
సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ సినిమా నుండి ఇదివరకు ఆకాశం అదిరే అనే పాట రిలీజైంది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట ఇంకా జనాల్లో నానుతుండగానే మరో పాటను రిలీజ్ చేసారు. చుక్కల్లోంచి తొంగిచూసే చక్కనైన జాబిల్లి, పక్కకొచ్చి కూచున్నది అయ్ బాబోయ్ ఏం చేయాలి అంటూ సాగే ఈ పాట పాడుకోవడానికి వీలుగా హాయిగా ఉంది. హీరో హీరోయిన్లు వేరే ఊరు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న జర్నీలో ఈ పాట వస్తున్నట్టుగా లిరికల్ వీడియోలో చూపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని రెహమాన్ అందించంగా, సంగీతాన్ని అవీక్ అందించారు. సింగర్ కార్తీక్ అద్భుతంగా పాడారు.
గౌతమ్ వాసుదేవ మీనన్ నటిస్తున్న చిత్రం
శ్రీ సింహా హీరోగా నటిస్తున్న ఉస్తాద్ సినిమాలో బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. క్రిషి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు ఉస్తాద్ టీజర్ రిలీజైంది. చిన్నప్పటి నుండి ఎత్తులకు వెళ్ళడాలంటే భయపడే హీరో, తన భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడో ఇందులో చూపించబోతున్నట్లు టీజర్ లో చూపించారు. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా, అనూ హసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, రవి శివ తేజ, సాయి కిరణ్ ఏడిద నటిస్తున్నారు.