Mana Shankara Vara Prasad Garu: 'మన శంకర వరప్రసాద్ గారు'లో సీక్రెట్ సర్ప్రైజ్.. మెగాస్టార్ నుంచి అదిరిపోయే ట్రీట్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భారీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి బరిలో అత్యంత అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ బలంగా నెలకొనగా, తాజా సమాచారం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న కథనం ప్రకారం, ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని ఓ భారీ సర్ప్రైజ్ దాగి ఉంది. అది కూడా ఒక స్పెషల్ సాంగ్ రూపంలో ఉండనుందని, ఆ పాటను ముందుగా ఎలాంటి ప్రమోషన్ లేకుండా నేరుగా థియేటర్లలోనే చూసి ఆస్వాదించేలా చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Details
రమణ గోగుల కాంబినేషన్‌లో ఓ పాట
ఇదిలా ఉండగా గతంలో ఈ చిత్రంలో రమణ గోగుల కాంబినేషన్‌లో ఓ పాట ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ సర్ప్రైజ్ అదే పాటేనా? లేక మరేదైనా స్పెషల్ క్యామియో సాంగ్ దాగి ఉందా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశం ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్ చిరంజీవి అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుండగా, ఈ 'సీక్రెట్ సాంగ్' వార్త సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే, రేపు అంటే జనవరి 11న సినిమా విడుదలయ్యే వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.