Page Loader
Shekhar Kammula: స్టార్ హీరోయిన్‌తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిల్మ్..? ఆనందంలో ఫ్యాన్స్!
స్టార్ హీరోయిన్‌తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిల్మ్..? ఆనందంలో ఫ్యాన్స్!

Shekhar Kammula: స్టార్ హీరోయిన్‌తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిల్మ్..? ఆనందంలో ఫ్యాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, తన యూనిక్ నెరేషన్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. డాలర్ డ్రీమ్‌తో దర్శకత్వ అరంగేట్రం చేసిన ఆయన, 'ఆనంద్' సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నాడు. అనంతరం గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో వరుసగా హిట్‌లు సాధించాడు. కమ్ముల సినిమాల్లో చూపించే ప్రేమకథలు మన జీవితాల్లో జరిగే అనుభూతిని కలిగిస్తాయి. మన ఇంట్లో లేదా పక్కింట్లో జరిగే సంఘటనలే అన్నట్లు ఉంటాయి. అందుకే ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో మినిమం గ్యారంటీ అనే గుర్తింపు వచ్చింది. ఇటీవలే ధనుష్, రష్మిక మందన్నా జంటగా నటించిన 'కుబేర' సినిమాను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల, మరోసారి విజయాన్ని అందుకున్నాడు.

Details

త్వరలోనే మరిన్ని వివరాలు

ఇందులో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు శేఖర్ కమ్ముల తదుపరి ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన తదుపరి సినిమాను ఓ లేడీ ఓరియెంటెడ్ కథగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట. అందులో ప్రధాన పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శేఖర్ - సమంత కాంబినేషన్‌పై అభిమానులు ఇప్పటికే భారీ ఆసక్తి చూపుతున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో త్వరలోనే స్పష్టత రానుంది.