LOADING...
Selva Raghavan: రెండో భార్యతో సెల్వరాఘవన్ విడాకులు? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!
రెండో భార్యతో సెల్వరాఘవన్ విడాకులు? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!

Selva Raghavan: రెండో భార్యతో సెల్వరాఘవన్ విడాకులు? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు, దర్శకుడు సెల్వరాఘవన్, ఆయన భార్య గీతాంజలి విడిపోతున్నారా? ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు కస్తూరి రాజా పెద్ద కుమారుడైన సెల్వరాఘవన్, తన మొదటి వివాహం నటి సోనియా అగర్వాల్‌తో చేసారు. అయితే ఆ బంధం కొన్ని సంవత్సరాలకే ముగిసింది. ఆ తర్వాత దర్శకురాలు, నిర్మాత గీతాంజలిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే సెల్వరాఘవన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తరచూ జీవిత సత్యాలను గురించి వీడియోలను, తన భార్య మరియు పిల్లలతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Details

ఇన్ స్టా నుంచి ఫోటోలు తొల‌గింపు

అయితే తాజాగా, గీతాంజలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి సెల్వరాఘవన్‌కు సంబంధించిన ఫొటోలు అన్నిటినీ తొలగించడమే ఫ్యాన్స్‌లో కొత్త చర్చలకు దారితీస్తోంది. ఈ చర్య వల్ల అభిమానుల్లో 'సెల్వరాఘవన్, గీతాంజలీ విడిపోతున్నారా?' అనే అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు తొలగించడం ద్వారా విడాకులు తీసుకున్నట్లు పరోక్షంగా ప్రకటించడం తరచుగా చూస్తున్నాం, అందువల్ల గీతాంజలి కూడా అదే మార్గాన్ని తీసుకుంటున్నారా అనే ఊహలు బలపడుతున్నాయి. సోనియా అగర్వాల్‌తో విడాకుల తర్వాత, సెల్వరాఘవన్ 2011లో గీతాంజలిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కాలంలో సెల్వరాఘవన్ ఎక్కువగా దర్శకత్వం చేయకపోయినా, విలన్ మరియు సహాయక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Details

కొన్ని నెల‌ల క్రిత‌మే వదంతులు

ఆయన విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో చేసిన నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇలాంటి వదంతులు సెల్వరాఘవన్ గురించి కొన్ని నెలల క్రితం కూడా వినిపించాయి. ఆయన తన భార్యతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసి, ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు. ప్రస్తుతం కూడా ఈ తాజా వార్తలపై సెల్వరాఘవన్ లేదా గీతాంజలీ ఏదైనా స్పష్టమైన వివరణ ఇవ్వలేదని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిద్దరూ తమ బంధం గురించి అధికారికంగా స్పందించే వరకు ఈ ఊహాగానాలు కొనసాగే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం వీరు కలిసి ఉండాలని కోరుతున్నారు.

Advertisement