
25కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేసారంటూ పోలీసులను ఆశ్రయించిన నటి గౌతమి
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ నటి గౌతమి తన స్థలాన్ని కబ్జా చేశారంటూ చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు.
25 కోట్ల రూపాయల విలువ గల తన స్థలాన్ని అళగప్పన్ అనే వ్యక్తి కబ్జా చేశారని నటి గౌతమి ఆరోపిస్తున్నారు.
తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్ ప్రాంతంలో నటి గౌతమ్ కి కొంత భూమి ఉంది. ఆ భూమిని తన కూతురు సుబ్బలక్ష్మి అవసరాల కోసం అమ్మేద్దామని అనుకుని ఆ ప్రాంతంలోని అళగప్పన్ అనే వ్యక్తిని కలుసుకున్నారు.
భూమిని అమ్మతానని చెప్పిన అళగప్పన్ మాటలను నమ్మిన గౌతమి, అమ్మడానికి అధికారాలను అళగప్పన్ కి అందించారు.
Details
చంపుతామని గౌతమికి బెదిరింపులు
ప్రస్తుతం అళగప్పన్, అతని భార్య, ఇంకా కుటుంబ సభ్యులందరూ కలిసి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేశారని నటి గౌతమి చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని నటి గౌతమి ఆరోపిస్తున్నారు.
గౌతమి ఫిర్యాదు ప్రకారం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు విషయంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
తెలుగువారైన గౌతమి 1980, 90 ప్రాంతాల్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించారు.