Rajni - Kamal : కోలీవుడ్‌లో సెన్సేషన్.. రజనీ-కమల్ కాంబోకు డైరక్టర్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్‌లో మరో భారీ సంచలనం రాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నో దశాబ్దాలుగా 'నువ్వా నేనా' అన్నట్టుగా పోటీపడిన ఈ ఇద్దరు లెజెండరీ స్టార్స్ కలిసి తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం ఊపందుకుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి స్నేహం, పోటీ రెండింటినీ పంచుకున్న రజనీ-కమల్ జంట ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కలవబోతున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారనే ఆసక్తి నెలలుగా కొనసాగుతోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌కు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం లోకేష్ ఈ చిత్రానికి కేవలం కథను మాత్రమే అందించబోతున్నాడట.
Details
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్
ఆయన కథ ఆధారంగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వం వహిస్తాడని కొన్ని మీడియా రిపోర్టులు పేర్కొన్నా, ప్రదీప్ స్వయంగా అలాంటి ప్రాజెక్ట్ తన వద్ద లేదని ఖండించాడు. ఇప్పుడేమో ఈ మల్టీస్టారర్‌కి డైరెక్టర్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం వస్తోంది. 'బీస్ట్', 'జైలర్' వంటి సూపర్‌హిట్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించబోతున్నారని తెలిసింది. రజనీ, కమల్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించబోయే ఈ చిత్రంపై చర్చలు దాదాపు పూర్తయ్యాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Details
ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్
ఇప్పటికే కమల్ హాసన్ 'జైలర్ 2', 'అన్బరివ్' వంటి ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండగా, అవి పూర్తి చేసిన వెంటనే ఈ కొత్త మల్టీస్టారర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలోని ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించబోతున్నందున సినిమా చుట్టూ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. అభిమానులు ఈ లెజెండరీ కలయికను థియేటర్లలో చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.