LOADING...
Rashmika Mandanna: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక!
ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక!

Rashmika Mandanna: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట తమ పెళ్లి చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో రష్మిక సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందిన భారతీయ పోస్టు రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2024 టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం ట్రోఫీతో జట్టుతో కలిసి దిగిన ఫోటోను ఆయన షేర్ చేయగా దానికి సుమారు 22 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి.

Details

సోషల్ మీడియాలో లైక్ ల యుద్ధం

దీంతో ఒకే పోస్టుకు ఆసియాలో 20 మిలియన్ల మార్క్ దాటిన తొలి అథ్లెట్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించారు. అయితే ఇప్పుడు రష్మిక-విజయ్‌ల పెళ్లి ఫోటోలు కేవలం కొద్ది గంటల్లోనే 23 మిలియన్ల లైకులు సాధించి కోహ్లీ రికార్డును అధిగమించాయి. దీంతో కోహ్లీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో వారు తమదైన శైలిలో స్పందిస్తూ, "విరాట్ రికార్డును మళ్లీ నంబర్-1 స్థానంలోకి తీసుకురావాలి.. అందరూ వెళ్లి ఆ ఫోటోకు లైక్ చేయండి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనివల్ల నెట్టింట ఒక విధమైన 'లైకుల యుద్ధం' సాగుతోందని చెప్పవచ్చు.

Details

దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

రష్మికకు దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే జయ్ దేవరకొండతో ఆమెకున్న క్రేజీ కెమిస్ట్రీ ఈ అపూర్వ స్పందనకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్ర, కొడవా సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో రష్మిక ధరించిన బంగారు ఆభరణాలు, ఇద్దరి ఆకర్షణీయమైన లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Advertisement