Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్‌కు సంచలన ట్రీట్.. 'లెనిన్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
ఈ వార్తాకథనం ఏంటి
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే సినీ ప్రేమికులలో హైప్ పెంచగా, ఇప్పుడు సాంగ్ విడుదల తేదీ రివీల్ కావడంతో ఉత్సాహం మరింత పెరిగింది. మేకర్స్ ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ మాస్ అవతార్‌లో, థమన్ సంగీతం మాయాజాలంతో, ఈ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Details
మూవీ వివరాలు
అన్నపూర్ణ స్టూడియోస్, మనమ్ ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా సూర్యదేవర నాగ వంశీ వ్యవహరిస్తున్నారు. హీరో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ లుక్, పోస్టర్ హైలైట్ నూతన సంవత్సరం రోజున విడుదలైన పోస్టర్‌లో అఖిల్ రగ్డ్ లుక్‌లో కనిపించారు. గడ్డం, లాంగ్ హెయిర్‌తో మాస్ హీరోగా మారిన ఆయన, షర్ట్ లాగుతూ స్మైల్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. అఖిల్ తన ఎక్స్ ఖాతాలో హ్యాపీ న్యూ ఇయర్.. లెనిన్ ఫస్ట్ సింగిల్ సూన్ అంటూ ట్వీట్ చేసి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పెంచారు.
Details
కెరీర్ హైలైట్స్
అఖిల్ 2015లో 'అఖిల్' సినిమాతో డెబ్యూ చేశారు. తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'ఏజెంట్' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు 'లెనిన్' కీలకంగా ఉంటుంది. సినిమా స్పెషల్ పాయింట్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ టైటిల్ 'లెనిన్'గా పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. సమ్మర్ 2026లో వరల్డ్‌వైడ్ రిలీజ్ కానున్న 'లెనిన్' అఖిల్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనవరి 5న రిలీజ్ కావనున్న ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులలో ఎంత సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాల్సిందే.