LOADING...
The Rajasaab sequel: 'ది రాజాసాబ్'కు సీక్వెల్‌ ఫిక్స్.. జోకర్‌గా ప్రభాస్‌, టైటిల్‌ ఇదే!
'ది రాజాసాబ్'కు సీక్వెల్‌ ఫిక్స్.. జోకర్‌గా ప్రభాస్‌, టైటిల్‌ ఇదే!

The Rajasaab sequel: 'ది రాజాసాబ్'కు సీక్వెల్‌ ఫిక్స్.. జోకర్‌గా ప్రభాస్‌, టైటిల్‌ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్‌ మూవీ 'ది రాజాసాబ్‌' నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటించారు. సంజయ్‌ దత్‌, జరీనా వాహబ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ హారర్‌, కామెడీ, ఫాంటసీ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు, జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలతోనే థియేటర్లలో ప్రభాస్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చాలాకాలం తర్వాత ప్రభాస్‌ వింటేజ్‌ లుక్స్‌లో కనిపించడం, కామెడీ, డాన్స్‌లతో అలరించడం అభిమానులను అమితంగా ఆనందింపజేస్తోంది. ఇక సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాలోని కామెడీతో పాటు నానమ్మ-మనవడు ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Details

సీక్వెల్ పై అధికారిక ప్రకటన

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ప్రభాస్‌ ప్రత్యేకమైన జోకర్‌ లుక్‌లో కనిపించడం మరో విశేషంగా మారింది. ఈ జోకర్‌ లుక్‌ గురించి దర్శకుడు మారుతిని ప్రశ్నించగా, ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని, ఆ సీక్వెల్‌లో జోకర్‌ పాత్ర కీలకంగా ఉండబోతుందని ఆయన వెల్లడించారు. తాజాగా సినిమా విడుదల అనంతరం ఆ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. 'ది రాజాసాబ్‌' చివర్లోనే సీక్వెల్‌కు సంబంధించిన హింట్‌ ఇచ్చిన చిత్రబృందం, ఇప్పుడు దాని టైటిల్‌ను కూడా రివీల్‌ చేసింది. 'ది రాజాసాబ్‌' సీక్వెల్‌కు 'రాజాసాబ్‌ సర్కస్‌ 1935' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ కొత్తగా ఉండటంతో పాటు, ప్రభాస్‌ జోకర్‌ పాత్రలో కనిపించనున్నాడన్న విషయం తెలిసి ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి.

Advertisement