Page Loader
Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ.. టైటిల్ ఇదే! 
సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ.. టైటిల్ ఇదే!

Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ.. టైటిల్ ఇదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఓ సినిమాతో ఆమె సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ఈ సినిమాకు 'బద్రి' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ పేరు 'హే చికీతా' టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో 'వైఫ్ ఆఫ్' ఫేమ్ అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తుండగా తన్మయి మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గరుడ వేగ అంజి ఈ సినిమాను అశోక ఆర్‌ఎన్‌ఎస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ధనరాజ్ లెక్కల దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో పృథ్వీ రాజ్, ప్రభాకర్, వీర శంకర్, బలగం సుజాత, అంజి మామ, గంగవ్వ, కీలక పాత్రలు పోషించనున్నారు.

Details

సంగీతాన్ని అందించనున్న చరణ్ అర్జున్

దర్శకుడు అజయ్ భూపతి ఈ మూవీ టైటిల్‌ను లాంచ్ చేయగా, అనసూయ భరద్వాజ్, సాయి రాజేష్, వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా హే చికీతా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు అందమైన లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. దివిజ ప్రభాకర్ ఇటీవల విడుదలైన 'బ్రహ్మా ఆనందం' మూవీలో కీలక పాత్ర పోషించింది. బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ వాలెంటైన్స్ డే రోజున విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.