Page Loader
Raja Saab: అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' వరుస అప్‌డేట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత 
అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' వరుస అప్‌డేట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Raja Saab: అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' వరుస అప్‌డేట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాజాసాబ్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రారంభమవుతాయని, ఆ తర్వాత వరుసగా విడుదల కాబోతున్నాయని చెప్పారు. దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ కలిసి ఈ అప్‌డేట్స్ కోసం ప్రణాళికలు రూపొందించారు.

Details

ఏప్రిల్ 10న మూవీ రిలీజ్

ఆ రోజు నుంచి విడుదల వరకు ప్రేక్షకులను 'రాజాసాబ్' ప్రపంచంలోకి తీసుకెళ్తామని, దర్శకుడు మారుతి ఒకరోజు కూడా వృథా చేయకుండా పని చేస్తున్నారని చెప్పారు. పండగలు వచ్చినా కూడా సెలవు తీసుకోకుండా షూటింగ్‌ను పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారని నిర్మాత పేర్కొన్నారు. 'రాజాసాబ్' మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం. ఇందులో ప్రభాస్‌ ఓ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. హరర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 10న విడుదల కానుంది.