LOADING...
Johnny Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు

Johnny Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో వివాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా కొరియోగ్రాఫర్ మదిత, జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, శారీరక, మానసికంగా వేధించాడని ఆమె తీవ్రమైన ఆరోపణలను చేసింది. ఇంకా, తనకు వచ్చే అవకాశాలను అడ్డుకుంటున్నారని ఆరోపించింది.

Details

జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు), 323 (గాయపరిచినట్లు) వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఎందుకంటే ఈ ఘటన ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుందని అధికారులు వెల్లడించారు.