
శర్వానంద్ 35: క్రితి శెట్టిపై ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేసిన టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఉప్పెన సృష్టించిన హీరోయిన్ క్రితి శెట్టి, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.
భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్, హీరో చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి క్రితి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఒకానొక వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో శర్వానంద్ 35 సినిమా షూటింగ్ సమయంలోని క్రితి శెట్టికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను చూపించారు.
అంతేకాదు, ఈ సినిమా నుండి క్రితి శెట్టి పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో మోడ్రన్ అమ్మాయిలా క్రితిశెట్టి కనిపిస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
The stunning @IamKrithiShetty in a beautifully woven character ✨
— People Media Factory (@peoplemediafcy) September 21, 2023
- https://t.co/g3sToxaYO6
Team #Sharwa35 extends its heartfelt wishes to the birthday girl ❤️
Massive Title Announcement & Teaser event updates soon ❤️🔥#HBDKrithiShetty@ImSharwanand @SriramAdittya… pic.twitter.com/Xrrf7ccxxL