Biker Glimpse: బైకర్‌గా శర్వానంద్.. అదిరిపోయే గ్లింప్స్‌తో హైప్ క్రియేట్!
ఈ వార్తాకథనం ఏంటి
చార్మింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వాటిలో ఒకటి 'బైకర్' అనే స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రాన్ని దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇందులో శర్వా ఓ 'బైక్ రేసర్‌గా' కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, సినిమాపై బజ్ పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కథకు సంబంధించిన నేపథ్యాన్ని ఆకట్టుకునే విధంగా చూపించారు.
Details
సంగీతాన్ని అందించనున్న జిబ్రాన్
ఎన్ని అడ్డంకులు వచ్చినా, తాను నిర్ణయించిన గమ్యాన్ని చేరుకోవడమే బైకర్ లక్ష్యమని ఈ గ్లింప్స్‌లో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో శర్వానంద్ పూర్తిగా స్లిమ్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్, బలమైన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం అవుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.