Sharwanand BHOGI Movie Official Teaser: 'గంగ'గా శర్వానంద్.. 'భోగి' టీజర్ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
హీరో శర్వానంద్ (Sharwanand), దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'భోగి' (BHOGI). ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'భోగి'లో అనుపమ పరమేశ్వరన్ 'కందుల సులోచన రాణి' పాత్రలో కనిపించనున్నారు. శర్వానంద్ 'గంగ' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ విభిన్నమైన పాత్రలతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
వివరాలు
నవంబర్ 12న రిలీజ్
కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 1960 కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
అప్పటి కాలానికి సంబంధించిన కథ, పాత్రలు, వాతావరణం ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇక విడుదల విషయానికొస్తే.. 'భోగి' నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ టీజర్ ఎలా ఉందో మీరూ చూడండి.