శర్వానంద్ బర్త్ డే: పాత్ర కన్నా సినిమా గొప్పదని నమ్మే నటుడి కెరీర్లోని వైవిధ్యమైన సినిమాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరు మాస్ సినిమాలతో జనాలకు దగ్గరైతే మరికొందరు క్లాస్ సినిమాలతో దగ్గర అవుతారు . కానీ కొందరు మాత్రమే తమ సినిమాలోని వైవిధ్యత వల్ల దగ్గర అవుతారు. ఆ వరుసలో శర్వానంద్ ముందుంటారు. 2004లో కెరీర్ మొదలెట్టినప్పటి నుండి ఇప్పటివరకు శర్వానంద్ తీరు అలాగే ఉంది. ఆయన సినిమాల్లో హీరో కనిపించరు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఈ రోజు శర్వానంద్ పుట్టినరోజు. మరికొద్ది రోజుల్లో పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్న శర్వానంద్, ఈ రోజుతో 39వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా శర్వానంద్ నటించిన సినిమాల్లోని వైవిధ్యభరిత సినిమాల గురించి ఓసారి మాట్లాడుకుందాం.
శర్వానంద్ కెరీర్ లోని వైవిధ్యమైన సినిమాలు
అమ్మ చెప్పింది (2006): వయసు పెరిగినా ఆలోచన పెరగని ఒక అబ్బాయి, కేవలం అమ్మ చెప్పిందని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశంకోసం ప్రాణత్యాగం చేసే బోస్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం, మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ప్రస్థానం (2010): అప్పటివరకూ వచ్చిన సినిమాలతో పోల్చితే ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపించాడు శర్వానంద్. ఈ సినిమాతో అతనికి మంచి పేరొచ్చింది. గమ్యం( 2008): క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, జీవితాన్ని పరిచయం చేస్తుంది. అల్లరి నరేష్ మరో పాత్రలో కనిపించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. మళ్ళీమళ్ళీ ఇది రాని రోజు, శతమానం భవతి, ఒకే ఒక జీవితం మొదలగు సినిమాలు.