
Bhogi : 'భోగి' షూటింగ్ కోసం మళ్లీ సెట్స్‌లోకి ' శర్వానంద్' ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కొరకు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్న హీరోలో శర్వానంద్ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన ఈ నటుడు, నటనలో మాత్రమే కాక, సినీ నిర్మాణ రంగంలోనూ తన సత్తాను చాటుకున్నారు. గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన శర్వానంద్, ఇప్పుడు మరో కొత్త అధ్యాయం ప్రారంభించారు. 'ఓంఐ' పేరుతో కొత్త బ్రాండ్‌ను లాంచ్ చేసి, సినిమా నిర్మాణాలతోపాటు వెల్‌నెస్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఉత్పత్తులు తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'భోగి' షూటింగ్ మళ్లీ ప్రారంభం కావాల్సి ఉంది.
Details
వచ్చే సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్
ఇప్పటికే రెండు ప్రధాన షెడ్యూల్స్ పూర్తయిన ఈ చిత్రానికి భారీ సెట్ నిర్మించినట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోవడం వల్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వారం నుండి మళ్లీ సెట్స్‌లో సందడి మొదలు కానుంది. శర్వానంద్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం 'బల్క్ డేట్స్' కేటాయించినప్పటి నుంచి, కీలక సన్నివేశాలను వేగంగా పూర్తిచేసే విధంగా యూనిట్ సీరియస్‌గా ప్లాన్ చేస్తోంది. మేకర్స్ జనవరి 2026లో షూటింగ్ పూర్తిచేసి సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఆషిక్ రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. నిర్మాతగా కె.కె. రాధామోహన్ వ్యవహరించనున్నారు.