Bhogi : విలేజ్ మాస్ లుక్‌లో శర్వానంద్.. 'భోగి' పోస్టర్ అదిరిపోయిందిగా!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' నుంచి చిత్రబృందం తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. రాఖీ పండుగ సందర్భంగా "గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు" అనే సెంటిమెంట్ క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పోస్టర్‌లో శర్వానంద్ సరికొత్త విలేజ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో తాటి ముంజలు కోస్తూ కనిపించిన ఆయన లుక్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో 1960ల నాటి వాతావరణాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.
వివరాలు
శరవేగంగా వీఎఫ్‌ఎక్స్ పనులు
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
శర్వానంద్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
కాగా, 'భోగి' కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.