LOADING...
Sharwanand: శర్వానంద్ లుక్ మైండ్ బ్లోయింగ్.. షాక్‌లో ఫ్యాన్స్!
శర్వానంద్ లుక్ మైండ్ బ్లోయింగ్.. షాక్‌లో ఫ్యాన్స్!

Sharwanand: శర్వానంద్ లుక్ మైండ్ బ్లోయింగ్.. షాక్‌లో ఫ్యాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఫ్యామిలీ, యూత్‌ఫుల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇటీవల 'మనమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడు శర్వా బౌన్స్‌బ్యాక్ కోసం పూర్తి ఫోకస్ పెట్టాడు. దీపావళి సందర్భంగా విడుదలైన తన కొత్త సినిమా 'బైకర్' (Biker) టైటిల్ పోస్టర్‌, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అభిలాష్ కన్కరా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా ప్రశంసనీయంగా ఉంది.

Details

నెలల తరబడి కష్టపడినట్లు సమాచారం

ఇటీవల విడుదలైన ఫోటోషూట్‌లో షర్ట్‌లెస్‌గా కనిపించిన శర్వా తన సిక్స్‌ప్యాక్ యాబ్స్‌తో అందరిని షాక్‌కు గురిచేశారు. సాధారణంగా 'చాకొలేట్ బాయ్' ఇమేజ్‌తో ఉండే శర్వా, ఈసారి మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌తో కొత్త ఇంప్రెషన్ సృష్టించారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'శర్వా లుక్ మైండ్ బ్లోయింగ్!', 'అనుకోని ట్రాన్స్‌ఫర్మేషన్!' అంటూ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. శర్వానంద్ ఈ లుక్ కోసం నెలల తరబడి కఠినమైన జిమ్ వర్కౌట్స్, కంట్రోల్డ్ డైట్ పాటించారని యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ క్రమశిక్షణ, డెడికేషన్ ఫలితంగా ఫిట్ అండ్ ఫియర్స్ లుక్ సృష్టించబడిందని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ కూడా ప్రశంసించారు.

Details

'బైకర్' మూవీ షూటింగ్ లో బీజీ

'బైకర్' చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటిస్తున్నది. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. సినిమాటోగ్రఫీ జి. యువరాజ్, సంగీతం ఘిబ్రాన్, ఎడిటింగ్ అనిల్ కుమార్ పి, ఆర్ట్ డైరెక్షన్ ఏ. పన్నీర్ సెల్వం, ప్రొడక్షన్ డిజైన్ రాజీవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సందీప్. శర్వానంద్ చివరిసారిగా 'శతమానం భవతి', 'మహానుభావుడు' చిత్రాలతో సూపర్‌హిట్ సాధించారు. ఇప్పుడు 'బైకర్'తో మరోసారి మంచి హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయినప్పటితోనే సినిమా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.