LOADING...
Biker: దీపావ‌ళి కానుకగా శర్వా 36 టైటిల్ లుక్ విడుద‌ల.. బైక‌ర్‌గా శర్వానంద్‌.
దీపావ‌ళి కానుకగా శర్వా 36 టైటిల్ లుక్ విడుద‌ల..బైక‌ర్‌గా శర్వానంద్

Biker: దీపావ‌ళి కానుకగా శర్వా 36 టైటిల్ లుక్ విడుద‌ల.. బైక‌ర్‌గా శర్వానంద్‌.

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'Sharwa 36'. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా మాళవికా నాయర్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం టైటిల్ లుక్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకులకు ప్రత్యేక బహుమతి అందించింది. ఈ సినిమాకు 'బైకర్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. శర్వానంద్‌ స్పోర్ట్స్‌ లుక్‌లో బైక్‌ రైడ్‌కు సిద్ధమవుతున్నట్లుగా ఉన్న పోస్టర్‌ సినిమాకి సంబంధించిన అంచనాలను పెంచేస్తోంది.

వివరాలు 

రైడర్‌ గెటప్‌లో హీరో.. సోషల్‌ మీడియాలో వైరల్

"మీ హెల్మెట్లు రెడీగా పెట్టుకోండి... రైడ్‌ వైల్డ్‌గా ఉండబోతోంది! గూస్‌బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ జర్నీకి సిద్ధంగా ఉండండి..." అంటూ శర్వానంద్‌ టీం ఇప్పటికే హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. హీరో రైడర్‌ గెటప్‌లో హ్యాండిల్ పట్టుకుని ఉన్న స్టిల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'Sharwa 36'లో డాక్టర్‌ రాజశేఖర్ శర్వానంద్‌ తండ్రి పాత్రలో నటించగా, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్