Page Loader
KJQ: దసరా నటుడు శశి ఓదెల హీరోగా కొత్త సినిమా మొదలు
KJQ: దసరా నటుడు శశి ఓదెల హీరోగా కొత్త కొత్త సినిమా మొదలు KJQ: దసరా నటుడు శశి ఓదెల హీరోగా కొత్త సినిమా మొదలు

KJQ: దసరా నటుడు శశి ఓదెల హీరోగా కొత్త సినిమా మొదలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు ధీక్షిత్ శెట్టి.దసరా సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల,దీక్షిత్ శెట్టి,యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నఈ చిత్రానికి కెకె రచయిత,దర్శకుడు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ముక్కోణపు ప్రేమకథకు పూర్ణచంద్ర తేజస్వి మ్యూజిక్ డైరెక్టర్, కాగా, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని నగేష్ బానెల్ నిర్వహించనున్నారు.కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Details 

90ల నాటి  పీరియాడికల్ క్రైమ్ డ్రామా

90ల నాటి ఒక ప్రత్యేకమైన కథాంశంతో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే కాన్సెప్ట్ గ్లింప్స్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అలాగే మేకర్స్ రీసెంట్‌గానే లాంఛనంగా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి #KJQ కింగ్ - జాకీ - క్వీన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్