LOADING...
Shhyamali: నాకు సానుభూతి అక్క‌ర్లేదు: రాజ్‌ మాజీ భార్య శ్యామాలి
నాకు సానుభూతి అక్క‌ర్లేదు: రాజ్‌ మాజీ భార్య శ్యామాలి

Shhyamali: నాకు సానుభూతి అక్క‌ర్లేదు: రాజ్‌ మాజీ భార్య శ్యామాలి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఎవరి సానుభూతి కోసం ఎదురుచూడటం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వబోనని ప్రకటించారు. తన నుంచి బ్రేకింగ్ న్యూస్‌లు గానీ, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు గానీ ఆశించవద్దని మీడియాను కోరారు. సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత చాలామంది తనపై జాలి చూపిస్తున్నారని చెప్పిన శ్యామాలి, అయితే ఇవేవీ తనను ప్రభావితం చేయడం లేదని పేర్కొన్నారు.

వివరాలు 

గురువుగారి ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న: శ్యామాలి

"నాపట్ల ప్రేమతో మద్దతు వ్యక్తం చేస్తున్నప్రతివారికీ ధన్యవాదాలు.మీ ఆశీస్సులను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. కానీ ప్రస్తుతం నేను వ్యక్తిగత విషయాలపై స్పందించే స్థితిలో లేను.ఎందుకంటే మా గురువుగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఇటీవల తెలిసింది.ఆయన ఆరోగ్యంగా ఉండాలని నిరంతరం ప్రార్థిస్తున్నాను. నాకు ప్రత్యేకంగా పీఆర్ టీమ్ ఏదీ లేదు.నా సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ నేనే స్వయంగా నిర్వహిస్తుంటాను. గురువుగారి ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నకారణంగా ప్రతి ఒక్కరికీ తక్షణంగా స్పందించడం నా వల్ల కావడం లేదు. నా మనస్థితిని అర్థం చేసుకుని నాకు సహకరించమని కోరుకుంటున్నాను. నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లను ఆశించవద్దు.నాకు మీడియా సానుభూతి అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను"అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్యామాలి చేసిన ట్వీట్ 

Advertisement

వివరాలు 

శ్యామాలి గురించి సోషల్ మీడియాలో పలువురు చర్చలు

ఇదిలా ఉండగా, నటి సమంత,బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు మాజీ జీవిత భాగస్వామి శ్యామాలి గురించి సోషల్ మీడియాలో పలువురు చర్చలు మొదలుపెట్టారు.

Advertisement