LOADING...
Shilpa Shetty: విదేశీ పర్యటనకు శిల్పాశెట్టి దంపతుల పిటిషన్.. రూ.60 కోట్లు డిపాజిట్ చేయమన్న కోర్టు..  
రూ.60 కోట్లు డిపాజిట్ చేయమన్న కోర్టు..

Shilpa Shetty: విదేశీ పర్యటనకు శిల్పాశెట్టి దంపతుల పిటిషన్.. రూ.60 కోట్లు డిపాజిట్ చేయమన్న కోర్టు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ పర్యటనకు అనుమతి కోసం శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా బాంబే హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల వారు ఆ పిటిషన్‌ను విత్‌డ్రా చేశారు.శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఒక వ్యాపారవేత్తను సుమారు రూ.60 కోట్ల మేర మోసం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం వారు ఈ జంటపై లుకౌట్ నోటీసులు (ఎల్‌వోసీ) జారీచేశారు. కొన్ని రోజుల క్రితం, వృత్తిపరంగా విదేశాల్లో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దేశం విడిచి వెళ్లాలనుకుంటే ముందుగా రూ.60 కోట్ల డిపాజిట్ చేయాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో విత్‌డ్రా చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శిల్పాశెట్టి దంపతుల పిటిషన్‌ విత్‌డ్రా