Page Loader
Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం 
Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం

Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం 

వ్రాసిన వారు Stalin
Feb 04, 2024
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవలే కేంద్రం పద్మవిభూషణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆదివారం కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చి మెగాస్టార్‌కు విషెష్ చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్( ఎక్స్) ద్వారా వెల్లడించారు. ప్రియమైన స్నేహితుడు శివన్న తన కోసం హైదరాబాద్‌కు వచ్చిన శుభాకాంక్షలు తెలిపినట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరం కలిసి భోజనం చేశామని, చాలాసేపు మాట్లాడుకున్నామని, శివన్న తండ్రి రాజ్‌ కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫొటోలను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి