LOADING...
Siva: 'శివ'లో మోహన్‌బాబు లేనందునే సినిమా విజయం సాధించింది : వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
'శివ'లో మోహన్‌బాబు లేనందునే సినిమా విజయం సాధించింది : వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Siva: 'శివ'లో మోహన్‌బాబు లేనందునే సినిమా విజయం సాధించింది : వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ చరిత్రలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన చిత్రం 'శివ'. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమా, అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా ముద్రలను చెరిపేసి కొత్త శకం ఆరంభించింది. కథ, టెక్నికల్‌ ప్రెజెంటేషన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, రియలిస్టిక్‌ యాక్షన్‌ సీన్స్‌ అన్నీ కలిపి 'శివ' సినిమాను లెజెండరీ స్థాయికి చేర్చాయి. ఇప్పుడు అదే సినిమాను సరికొత్త రూపంలో, అత్యాధునిక 4K క్వాలిటీతో నవంబర్‌ 14న థియేటర్లలో మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విశేషం బయటకు వచ్చింది.

Details

గణేష్ పాత్ర కోసం మొదటగా  మోహన్ బాబు

సినిమాలో రఘువరన్‌ వద్ద పనిచేసే రౌడీ గణేష్‌ పాత్ర కోసం, నిర్మాత అక్కినేని వెంకట్‌ అప్పట్లో ప్రముఖ నటుడు మోహన్‌ బాబు పేరును సూచించారట. హీరోకు వార్నింగ్‌ ఇస్తూ వచ్చే ఆ సీన్‌ మరింత ప్రభావవంతంగా ఉండాలంటే, ప్రజలకు తెలిసిన యాక్టర్‌ అయితే బాగుంటుందని నిర్మాత అభిప్రాయపడ్డారని సమాచారం. అయితే, వర్మ మాత్రం వెంటనే మోహన్‌బాబు పేరును తిరస్కరించారు. ఆ నిర్ణయానికి వెనుక ఉన్న కారణం కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. వర్మ మాటల్లో మోహన్‌బాబు గారు ప్రేక్షకుల మనసుల్లో ఫ్యామిలీ మాన్‌గా స్థానం సంపాదించారు. ఆయన మాట్లాడే ప్రతి డైలాగ్‌కి ఓ ప్రత్యేకమైన స్టైల్‌ ఉంటుంది.

Details

మోహన్ బాబు రౌడీలా ఉహించలేం

అలాంటి వ్యక్తి రౌడీ పాత్రలో వస్తే, ప్రేక్షకుడు ఆ సీన్‌లో గణేష్‌ అనే రౌడీని కాదు, మోహన్‌బాబునే చూస్తాడు. అప్పుడు ఆ పాత్రకు కావాల్సిన భయాన్ని, క్రూరత్వాన్ని ప్రేక్షకుడు అనుభవించలేడని చెప్పారట. అందుకే ఆ పాత్రకు వర్మ కొత్త వ్యక్తి అయిన విశ్వనాథ్‌ను ఎంపిక చేశారు. ఆయన ఆ పాత్రను సహజంగా పోషించడంతో, ఆ సీన్‌ సినిమా హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఆసక్తికరమైన విషయం మరోసారి వెలుగులోకి రావడంతో, 'శివ' సినిమాపై ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.

Advertisement