LOADING...
Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్‌..! మరోసారి వాయిదా పడిన 'రాజాసాబ్'
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్‌..! మరోసారి వాయిదా పడిన 'రాజాసాబ్'

Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్‌..! మరోసారి వాయిదా పడిన 'రాజాసాబ్'

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈమధ్య కాలంలో సినిమాలు చేయడం మాత్రమే కాదు.. అవి నిర్ణయించిన తేదీల్లో రిలీజ్ చేయడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. దాదాపు ప్రతి పెద్ద సినిమా వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఎప్పటిలాగే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. బాహుబలి తర్వాత మొదలైన ఈ "పోస్ట్‌పోన్‌ కల్చర్" ఆయన కెరీర్‌లోని దాదాపు అన్ని సినిమాలను తాకింది. ఇప్పుడు ఆయన తాజా చిత్రం 'రాజాసాబ్‌ (Rajasaab)' కూడా అదే దారిలో నడుస్తోందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మొదటగా 2025 సమ్మర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేశారు.

Details

వాయిదా పడే అవకాశాలు ఎక్కువ

కానీ ప్రభాస్ ఇప్పటికే కమిట్‌ చేసిన ప్రాజెక్టులు ఆలస్యమవడంతో ఆ ప్లాన్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత, విడుదల తేదీని సెప్టెంబర్‌కు మార్చాలని నిర్ణయించారు. అయితే ఆ సమయానికి పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఓజీ' సినిమా రిలీజ్ కావడంతో క్లాష్‌ వద్దనుకుని 'రాజాసాబ్'ను 2026 సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. జనవరి 9 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 'రాజాసాబ్' సినిమా భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌తో రూపొందుతోంది. ఇందులో 3,000కు పైగా సీజీ షాట్లు ఉన్నాయట.

Details

ఫైనల్ వర్షన్ సిద్ధం కావడానికి సమయం

వాటికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ఫైనల్ వెర్షన్ సిద్ధం కావడానికి సమయం పడుతుందని, దాంతో సినిమా మరోసారి రిలీజ్‌ డేట్‌ మార్చాల్సి వస్తుందని టాక్‌. ఈ కారణంగా రాజాసాబ్* ను సంక్రాంతి రేస్‌ నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మళ్లీ వాయిదా?, ఇంకా ఎన్నిసార్లు ఇలా జరుగుతుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్‌పై పెరుగుతున్న అంచనాలను చూస్తే, ఈ వాయిదా నిరాశే అయినా.. గ్రాఫిక్స్ పరంగా మెరుగైన ఫలితం కోసం మేకర్స్ తీసుకుంటున్న సమయం విలువైనదేనని కొందరు అంటున్నారు.