Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్‌కు షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్.. కొన్ని థియేటర్లలోనే రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో 'శంకర్ దాదా MBBS' ఒకటి.
జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో 2004లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన 'మున్నా భాయ్ ఎంబీబీఎస్' చిత్రానికి ఇది రిమీక్.
కానీ ఒరిజినల్ వరెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్సన్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాను మేకర్స్ లేటెస్ట్ 4Kలోకి మార్చి గ్రాండ్‌గా నవంబర్ 4న రీ రిలీజ్ చేయబోతున్నారు.
వారం రోజుల ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు.
అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Details
నవంబర్ 4న రీ రిలీజ్
ఇప్పటివరకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నలబై లక్షలు కూడా దాటలేదంట.
ఈ మూవీ అటు ఇటుగా యాభై లక్షల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమాపై క్రేజ్ మోస్తారుగానే ఉండటంతో లిమిటెడ్ స్క్రీన్స్‌లోనే ఈ మూవీ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్, వైజాగ్‌తో పాటు మరికొన్ని సీటీస్‌లో తక్కువ థియేటర్లను ఈ సినిమాకు కేటాయించినట్లు తెలిసింది.
ఈ సినిమాలో సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించి, మెప్పించింది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో అలరించిన విషయం తెలిసిందే.