Page Loader
Grammy Awards: గ్రామీ అవార్డుల వేడుకలో షాకింగ్‌ ఘటన.. దుస్తులు తీసేసిన ర్యాపర్ భార్య
గ్రామీ అవార్డుల వేడుకలో షాకింగ్‌ ఘటన.. దుస్తులు తీసేసిన ర్యాపర్ భార్య

Grammy Awards: గ్రామీ అవార్డుల వేడుకలో షాకింగ్‌ ఘటన.. దుస్తులు తీసేసిన ర్యాపర్ భార్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలో ఒక షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్లు హాజరై రెడ్‌ కార్పెట్‌పై ఫొటోల కోసం పోజులిచ్చారు. కానీ ర్యాప్‌ సింగర్ కాన్యే వెస్ట్‌, ఆయన భార్య మోడల్ బియాంకా సెన్సోరీ వివాదాస్పదంగా ప్రవర్తించారు.

Details

దుస్తులు న్యూడ్ గా ఫోజులిచ్చిన బియాంక

కాన్యే వెస్ట్‌ 2025లో బెస్ట్ ర్యాప్ సాంగ్‌కు నామినేట్ అయిన వేళ, అతని భార్య బియాంకా రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. అయితే ఫొటో షూట్‌ సందర్భంగా ఆమె తన దుస్తులు తీసేసి న్యూడ్‌గా ఫోజులిచ్చింది. ఈ ఘటనకు అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. నిర్వాహకులు వెంటనే ఈ జంటను వేడుక నుంచి పంపించారు. బియాంకా ఎందుకు ఇలాంటి ప్రవర్తించే ఇంకా కారణం తెలియరాలేదు.