Manchu Lakshmi: ప్రతిదీ భర్త అనుమతిలో చేయాలా..? రకుల్‌పై మంచు లక్ష్మి ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో చాలామంది నటులు, నటీమణులు స్నేహితులుగా ఉండడం, కలిసి వెకేషన్‌కి వెళ్లడం సహజమే. అందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన క్లోజ్ ఫ్రెండ్స్ అంటే రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి. ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఈ స్నేహం సోషల్ మీడియాలో కూడా తరచూ హైలైట్ అయ్యేది. హాలీడేస్, వెకేషన్స్, వీకెండ్ గ్యాదరింగ్స్, చిన్నపాటి పార్టీలకు వీరిద్దరూ కలిసి వెళ్తూ ఉండేవారు. అయితే ఇటీవల ఈ ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం లేదని అభిమానులు గమనిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రకుల్ ప్రీత్ ఇటీవల జరిగిన పెళ్లే. తాజాగా 'మాయ మేల్ ఫెమినిస్ట్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మంచు లక్ష్మి దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Details
పెళ్లి తర్వాత రకుల్ లో మార్పు వచ్చింది
ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే రకుల్‌నే. కానీ ఇటీవల మా జీవితాల్లో పెద్ద మార్పులు వచ్చాయి. నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను. రకుల్ జాకీని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత రకుల్ ప్రవర్తనలో వచ్చిన మార్పు నన్ను ఆశ్చర్యపరిచింది. చిన్న విషయమైనా జాకీకి చెప్పాలనుకుంటుంది. నేను ఏదైనా అడిగినా, ఎక్కడికైనా వెళ్లాలన్నా ముందుగా జాకీని అడిగి చెప్తానంటుంది. కొత్తగా పెళ్లైన జంటల్లో ఇది కామనే. కానీ నేను రకుల్ విషయానికొస్తే మరో ఏడాది వరకు చూస్తాను. అప్పటికీ మారకపోతే వదిలిపెట్టేది లేదు... గట్టిగా దండిస్తాను, వార్నింగ్ కూడా ఇస్తానంటూ చెప్పింది మంచు లక్ష్మి. ఇలా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.