Loading...
Shraddha Kapoor: వితాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్.. 'ఈఠా' ట్రైలర్ విడుదల!

Shraddha Kapoor: వితాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్.. 'ఈఠా' ట్రైలర్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఈఠా'. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణీ కళాకారిణి వితాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. 'ఛావా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. మహారాష్ట్ర జానపద సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్న లావణీ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించిన వితాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్ అద్భుతంగా ఒదిగిపోయినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.

వివరాలు

కీలక పాత్రలో రణ్‌దీప్

ఓ సాధారణ మహిళా కళాకారిణి తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.

ఈ పాత్ర శ్రద్ధా కపూర్ సినీ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విలక్షణ నటుడు రణ్‌దీప్ హూడా కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన భాగస్వామ్యం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

ADVERTISEMENT