Kaliyugam 2064: భవిష్యత్తులో నీళ్లు, ఆహరం దొరక్కపోతే.. 'కలియుగమ్ 2064' ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
శ్రద్ధా శ్రీనాథ్,కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్,అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం 'కలియుగమ్ 2064' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రాన్ని ఆర్‌కే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించగా,దర్శకుడిగా ప్రమోద్ సుందర్ బాధ్యతలు నిర్వహించారు.
తెలుగు,తమిళ భాషల్లో ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు.
తాజాగా,ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) విడుదల చేశారు.
ట్రైలర్‌ను పరిశీలిస్తే, 2064 సంవత్సరం నాటికి ప్రపంచం ఎలాంటి మార్పులను ఎదుర్కొనబోతుందో స్పష్టంగా చూపిస్తున్నారు.
వివరాలు
సినిమా థ్రిల్లర్‌కి బలమైన మూలం
నీళ్లు, ఆహారం వంటి జీవనాధారాలు అరుదయ్యే పరిస్థితుల్లో, ప్రజలు ఎలా స్పందిస్తారు అన్నదాని చుట్టూ కథ నడుస్తుంది.
అటువంటి కఠిన పరిస్థితుల్లో, ఓ ఇంట్లో తినేందుకు తిండి, త్రాగడానికి తీపినీళ్లు లభిస్తే, ఆ ఇంటిని చూసిన వారు ఎలా ప్రవర్తించారు
అన్నదే ప్రధాన సస్పెన్స్ గా చూపిస్తున్నారు. ఈ అంశం సినిమా థ్రిల్లర్‌కి బలమైన మూలంగా నిలుస్తుందని ట్రైలర్ స్పష్టంగా తెలియజేస్తోంది.
ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్జీవీ మాట్లాడుతూ.. 'కలియుగమ్ 2064' ట్రైలర్ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది పూర్తిగా భవిష్యత్ నేపథ్యంలో సాగే కథను సూచిస్తోంది. సినిమాటోగ్రఫీ, పాత్రల రూపకల్పన, నటుల అభినయం అన్నీ కలిపి ఒక ఆధునిక కాలపు నవల చదివిన అనుభూతిని కలిగించాయి అని అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కలియుగమ్ 2064' ట్రైలర్ విడుదల
Kaliyugam doesn't ask for your attention.
— Mythri Movie Distributors LLP (@MythriRelease) April 25, 2025
It takes it.
It burns the screen.
It screams through your bones.
Witness the world of Kaliyugam on May 9th 2025!
Release by @MythriRelease ❤️🔥
'Kaliyugam 2064' trailer out now :https://t.co/r3iFWGNqUl#kaliyugam2064… pic.twitter.com/U99L2fLPmH