Shreya Ghoshal: శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్.. రెండు వారాలైనా స్పందించలేదని అవేదన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఎక్స్ ఖాతా హ్యాక్ అయిన విషయం తెలిసిందే.
సుమారు రెండు వారాలు గడిచినా ఖాతా రికవరీ కాలేదని ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తన ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్‌లను క్లిక్ చేయొద్దని అభిమానులకు ఆమె సూచించారు.
ఫిబ్రవరి 13 నుంచి తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యిందని, ఎక్స్ బృందాన్ని సంప్రదించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశానని చెప్పింది.
ఎక్స్ ఖాతాను సంప్రదించినా స్పందించలేదన్నారు. ఖాతాను డిలీట్ చేయాలని అనుకున్నా, అది కూడా సాధ్యపడటం లేదన్నారు.
Details
లింక్స్ క్లిక్ చేయొద్దు అంటూ సూచన
లాగిన్ అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని శ్రేయా ఘోషల్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తన ఖాతాలో కనిపించే లింక్‌లు, పోస్టులు ఎవరూ క్లిక్ చేయొద్దని సూచించింది.
అవి మోసపూరితమైనవి, అలాగే అందులో వచ్చే సందేశాలను నమ్మొద్దని తెలిపింది.
తన ఖాతా రికవరీ అయిన వెంటనే తాను వీడియో సందేశాన్ని పోస్ట్ చేస్తానని శ్రేయా ఘోషల్ స్పష్టం చేశారు.