Shweta Verma: బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం
బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అగ్ని ప్రమాదం జరిగి ఒక గది మొత్తం కాలిపోయినట్లు ఆమె చెప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, కుటుంబ సభ్యులు, తన నా పెంపుడు జంతువులు కూడా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. శ్వేతా పోస్ట్ చూసిన ఆమెకు మద్దతుగా అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. శ్వేతా వర్మ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ ఇంట్లో డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఆమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.