JACK: 'జాక్' నుంచి 'కిస్' మెలోడీ రిలీజ్.. వైష్ణవితో ముద్దుకోసం సిద్ధు తంటాలు..
ఈ వార్తాకథనం ఏంటి
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "జాక్".
ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా,శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ వేగంగా పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా, మేకర్స్ మువీ నుంచి"కిస్"అనే మెలోడీ పాటను విడుదల చేశారు.
ఈ పాటను పరిశీలిస్తే,సిద్ధు,వైష్ణవితో ముద్దుకోసం ఉత్సాహంగా ఆమె వెంటపడతాడు.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో "కిస్"పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.
ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా,జావేద్ అలీ,అమల చేబోలు కలిసి ఆలపించారు.భాస్కర్ కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#KissSong out now 🎧
— Shreyas Sriniwaas (@shreyasmedia) March 20, 2025
— https://t.co/nKERSsHfzh#Jack #JackOnApril10th pic.twitter.com/ymp8551fvp