
తెలుసు కదా: డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం టైటిల్ టీజర్ చూసారా?
ఈ వార్తాకథనం ఏంటి
డీజే టిల్లు సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆ సినిమా విడుదల కాకముందే మరొక కొత్త చిత్రాన్ని సిద్దు జొన్నలగడ్డ ప్రకటించాడు. తెలుసు కదా అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్ర టైటిల్ టీజర్ ని విడుదల చేశారు. తెలుసు కదా సినిమాలో రాశీ ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న తెలుసు కదా సినిమాను నీరజ కోన రచించి దర్శకత్వం వహిస్తున్నారు.
తమన్ సంగీతమందిస్తున్న తెలుసు కదా సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్రనిర్మాణ సంస్థ ట్వీట్
#TelusuKada, To love and to be loved is the only way to live. 🫶 A new journey to discover unconditional love . 💝 https://t.co/wwNqwfrQD8 @NeerajaKona #SiddhuJonnalagadda #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @sreekar_prasad @dopyuvraj…
— People Media Factory (@peoplemediafcy) October 16, 2023