SIIMA: సైమా అవార్డ్స్ 2025.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలి రోజు, కన్నడ, తెలుగు సినిమాల్లో విశేష ప్రతిభ కనబరచిన నటీనటులు తమకు అర్హమైన అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో 2024లో ఘన ప్రతిభ ప్రదర్శించిన సినిమాలు, నటీనటులు గుర్తింపు పొందారు. ఈ వేడుకలో ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా 'కల్కి 2898' ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మంధాన, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
Details
సైమా 2025 విజేతలు వీరే (తెలుగు)
ఉత్తమ చిత్రం - కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప2)
ఉత్తమ నటి - రష్మిక మందన్నా (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు - సుకుమార్ (పుష్ప2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) - మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) - ప్రశాంత్ వర్మ (హనుమాన్)
ఉత్తమ సహాయ నటుడు - అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
Details
సైమా 2025 విజేతలు వీరే (తెలుగు)
ఉత్తమ సహాయ నటి - అన్నే బెన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప2)
ఉత్తమ గీతరచయిత - రామ్ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
ఉత్తమ గాయకుడు - శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని - శిల్పా రావు (చుట్టమల్లే)
ఉత్తమ విలన్ - కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ పరిచయ నటి - భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
ఉత్తమ పరిచయ నటుడు - సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు - నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత - నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (దేవర)