NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై ప్రాణం కోల్పోయిన ప్రముఖ నటి
    తదుపరి వార్తా కథనం
    ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై ప్రాణం కోల్పోయిన ప్రముఖ నటి
    ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై ప్రాణం కోల్పోయిన ప్రముఖ నటీమణి

    ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై ప్రాణం కోల్పోయిన ప్రముఖ నటి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 02, 2023
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటీ, మోడల్ సిల్వినా లూనా ప్రాణాలు కోల్పోయింది. అందం కోసం చేసిన ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో ఆమె తుదిశ్వాస విడిచిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

    కిడ్నీ సమస్యతో ఆగస్ట్ 31న సిల్వినా మరణించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సిల్వినా కిడ్నీ సమస్యలతో బాధపడుతుంది. ప్రతివారం కిడ్నీలకు సంబంధించిన డయాలసిస్ ప్రక్రియను చేయించుకుంటోంది.

    ఇటీవలే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు సిల్వినా మొగ్గుచూపింది. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ సర్జరీ వికటించి కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. దీంతో నానా యాతనతో చివరకు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.

    ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై సిల్వినా మరణంతో అర్జెంటీనా నటీనటులు, ఆమె అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు నివాళులు అర్పించారు.

    DETAILS

     ప్రముఖ నటిగా, యాంకర్ గా సిల్వినా లూనా ఫేమస్

    సిల్వినా లూనా, అర్జెంటీనా టెలివిజన్ రంగంలో ప్రముఖ నటిగా, యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

    అందం కోసం కొంతమంది మోడల్స్, నటీనటులు తమ శరీరంలోని కొన్ని భాగాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం పరిపాటిగా మారింది.

    అయితే కొన్నిసార్లు ఈ ప్లాస్టిక్ సర్జరీ వికటించి ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలోనే కాస్మోటాలజీకి సంబంధించిన వైద్య చికిత్సలు, ఆపరేషన్లు ప్రాణాలతో చెలగాటంగా మారుతుండటం కలవరానికి గురిచేస్తోంది.

    అందం ఉంటేనే అవకాశాలు వస్తాయనే ఆలోచనతో ప్లాస్టిక్ సర్జరీ వైపు మొగ్గు చూపిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    సినిమా

    ఖుషి నుండి వచ్చేస్తున్న కొత్త పాట: రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓసి పెళ్ళామా ప్రోమో రిలీజ్  ఖుషి
    బాయ్స్ హాస్టల్ రివ్యూ: వార్డెన్ మరణం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా?  తెలుగు సినిమా
    ఓజీ గ్లింప్స్ వీడియోకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్: అభిమానులకు పూనకాలు రావాల్సిందే  పవన్ కళ్యాణ్
    Happy Birthday Suman: తమిళం నుండి వచ్చి తెలుగులో టాప్ హీరోగా ఎదిగిన సుమన్ కెరీర్లోని ఆసక్తికర విషయాలు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025