Page Loader
సింహాద్రి రీ రిలీజ్: ఎన్టీఆర్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ రెడీ 
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ ఐ మ్యాక్స్ లో సింహాద్రి రీ రిలీజ్

సింహాద్రి రీ రిలీజ్: ఎన్టీఆర్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ రెడీ 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 24, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20వ తేదీన సింహాద్రి సినిమా మళ్లీ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై క్రేజీ అప్డేట్ వచ్చింది. సింహాద్రి సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లలో ఒకటైన మెల్ బోర్న్ థియేటర్ లో విడుదల చేయబోతున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఐమాక్స్ థియేటర్లో సింహాద్రి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఈ థియేటర్లో సింహాద్రి సినిమా చూడడం కోసం ఆల్రెడీ బుకింగ్స్ మొదలైపోయాయి. 4K, డాల్బీ అట్మాస్ ఫీచర్ తో సింహాద్రి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, భూమికా చావ్లా, అంకిత హీరోయిన్లుగా నటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ ఐ మ్యాక్స్ లో సింహాద్రి రీ రిలీజ్