LOADING...
Singer Kalpana: ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన
ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన

Singer Kalpana: ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, కుమార్తె దయ ప్రసాద్‌తో చదువు విషయంలో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్రలేకపోవడంతో అధికంగా నిద్ర మాత్రలు తీసుకున్నానని కల్పన స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. కల్పన గత ఐదేళ్లుగా తన భర్త ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఓ విల్లాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆమె కుమార్తె దయ ప్రసాద్‌తో చదువు విషయంలో అభిప్రాయభేదాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కల్పన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో భర్త ప్రసాద్ ఆమెకు పలు మార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదు.

Details

నిద్ర పట్టకపోవడంతోనే మాత్రలు తీసుకున్నా

దీంతో ప్రసాద్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయగా, వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. కేపీహెచ్‌బీ పోలీసులు, కాలనీ వెల్ఫేర్ సభ్యులు కలసి ఇంటి తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో వెనుక ఉన్న కిచెన్ డోర్ నుంచి లోపలికి ప్రవేశించారు. అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించి, ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన స్పష్టంగా చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కుమార్తెతో జరిగిన ఘటన కారణంగా నిద్రలేకపోవడం వల్ల అనేక నిద్ర మాత్రలు తీసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె వెల్లడించినట్టు పోలీసులు పేర్కొన్నారు.