ప్రెగ్నెన్సీ విషయంపై వస్తున్న వార్తలకు స్పందించిన సింగర్ సునీత
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా తారలపై పుకార్లు సహజం. కొన్ని సార్లు ఆ పుకార్లు నిజమవుతాయి కూడా. సాధారణంగా ఇలాంటి పుకార్లు కూడా కావాలనే పుట్టిస్తుంటారని కొందరు చెబుతారు.
దాని గురించి పక్కన పెడితే ఈ మధ్య సినిమా తారల పెళ్ళి విషయంలో చాలా పుకార్లు వస్తున్నాయి.
పెళ్ళైన తారల విషయంలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుకారు చక్కర్లు కొడుతుంటుంది. తాజాగా సింగర్ సునీత, తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. గత కొన్ని రోజులుగా సునీత ప్రెగ్నెంట్ అంటూ అనేక వార్తలు షికారు చేసాయి.
ఇప్పుడు ఆ వార్తలను సునీత ఖండించింది. నేను ప్రెగ్నెంటా, నాకే తెలీదే అంటూ వెటకారంగా మాట్లాడింది. ఇలాంటి పుకార్లు తన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపవని ఆమె అంది.
తెలుగు సినిమా
వాలెంటైన్స్ డే రోజున ఆడవాళ్ళే ఫ్లవర్స్ అందించాలంటున్న సునీత
ప్రెగ్నెన్సీ వంటి పర్సనల్ విషయం గురించి పుకార్లు సృష్టించే వారి పరిణతి తనకు తెలుసనీ, మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళే ఇలా చేస్తారని ఆమె పేర్కొంది.
అదలా ఉంటే, వాలెంటైన్స్ డే గురించి మాట్లాడిన సునీత, ప్రేమికుల రోజును పెద్దగా పట్టించుకోననీ, ప్రతీరోజు లాగే అది కూడా ఒక రోజనీ, ఇంటికి వెళ్ళగానే పూలగుత్తితో తన భర్త ఎదురవ్వాలని అనుకోనని చెప్పింది.
దానికి బదులుగా తనే ఒక పూలగుత్తిని భర్త కోసం తీసుకెళ్తానని, ఎప్పుడూ మగవాళ్లే ఎందుకు బొకే ఇవ్వాలనీ, ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా అనీ, ఈ విషయాన్ని ఆడవాళ్ళందరితో చెబుతాననీ అంది.
మొత్తానికి ప్రెగ్నెన్సీ విషయం మీద వచ్చినవన్నీ పుకార్లేనని తేలిపోయింది.