
Zubeen Garg: సింగర్ జుబిన్ గర్గ్ మృతి.. సీఐడీతో దర్యాప్తు చేపిస్తాం : అస్సాం సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ (52) శుక్రవారం సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతి చెందడం తెలిసిందే. అయితే, ఆయన మరణం సంబంధించి వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రారంభంలో సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జుబిన్ మృతి చెందినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరణ ధ్రువీకరణ పత్రంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఒక మీటింగ్‌లో దర్యాప్తు చేపట్టనున్నట్టు తెలిపారు. సింగపూర్ హైకమిషన్ పంపిన పత్రంలో జుబిన్ నీటిలో మునిగిపోవడం వల్ల చనిపోయినట్లు వివరించారు. కానీ ఇది పోస్టుమార్టం నివేదిక కాదని తెలిపారు.
Details
పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా చేస్తాం
సీఎం హిమంత బిశ్వ శర్మ, "వీటిని సీఐడీకి అందించబోతున్నాం. అంతేకాక, అక్కడి అధికారులను కోరుతున్నాం, వీలైనంత త్వరగా పోస్టుమార్టం రిపోర్టును ఇవ్వాలని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా చూస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు. ఆదివారం అస్సాం గువాహటి లోని సరూసజయ్ స్టేడియంలో దాదాపు లక్ష మంది అభిమానులు జుబిన్ గర్గ్ కి నివాళులర్పించారు. మృతదేహం ఉంచిన స్టేడియం వద్ద భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.