Page Loader
Siri: 'జబర్దస్త్‌'కు కొత్త యాంకర్.. బిగ్‌బాస్ బ్యూటీకి సూపర్ ఛాన్స్
Siri: 'జబర్దస్త్‌'కు కొత్త యాంకర్.. బిగ్‌బాస్ బ్యూటీకి సూపర్ ఛాన్స్

Siri: 'జబర్దస్త్‌'కు కొత్త యాంకర్.. బిగ్‌బాస్ బ్యూటీకి సూపర్ ఛాన్స్

వ్రాసిన వారు Stalin
Nov 06, 2023
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు టెలివిజన్‌లో షోల్లో షో 'జబర్దస్త్‌'కు ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. చాలా ఏళ్లుగా విజయవంతంగా రన్ అవుతున్న ఈ షోలో ఎలాంటి మార్పు జరిగినా అది వార్తగా మారుతుంది. తాజాగా విడుదలైన 'జబర్దస్త్‌' ప్రోమో ద్వారా ఆసక్తికర విషయం తెలిసింది. ఇన్నాళ్లు ఈ షోకు యాంకర్‌గా ఉన్న సౌమ్య రావు తప్పుకున్నారు. తాజాగా విడుదల ఎపిసోడ్‌కు బిగ్‌ బాస్ ఫేమ్, నటి సిరి యాంకర్‌గా వ్యవహరించారు. యాంకర్‌గా సిరి రావడంపై ఆమెను తప్పించారా? లేక ఆమే తనంతట తాను వెళ్లారా? అనే దానిపై ఊహగానాలు వినిపిస్తున్నాయి. 'జబర్దస్త్‌'కు ఇప్పటివరకు ముగ్గురు యాంకర్లు మారారు. మొదట అనసూయ, తర్వాత రష్మీ, అనంతరం సౌమ్య రావు, ఇప్పుడు సిరి యాంకర్‌గా పని చేస్తున్నారు.

సిరి

'జబర్దస్త్‌'కు నాలుగో యాంకర్‌గా సిరి

'జబర్దస్త్‌'కు ఇప్పటి వరకు ముగ్గురు యాంకర్లు మారారు. మొదట అనసూయ, తర్వాత రష్మీ, అనంతరం సౌమ్య రావు, ఇప్పుడు సిరి యాంకర్‌గా పని చేస్తున్నారు. మొదట 'జబర్దస్త్‌' షో అనసూయ యాంకర్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల అనసూయ యాంకరింగ్‌ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రష్మీ యాంకర్‌గా పరిచయమైంది. ఆ తర్వాత షో నిర్వాహకులు 'జబర్దస్త్‌'కు కొనసాగింపుగా 'ఎక్స్ట్రా జబర్దస్త్‌ 'ను మొదలు పెట్టారు. ఈ క్రమంలో 'జబర్దస్త్‌' యాంకర్‌గా మళ్లీ అనసూయ వచ్చారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్‌ ' యాంకర్‌గా రష్మీ చేసారు. అనసూయ కొంతకాలం తర్వాత మళ్లీ యాంకర్‌గా తప్పుకోవడంతో సౌమ్యరావును యాంకర్‌గా తీసుకొచ్చారు.