MAD Square: MAD సీక్వెల్ కోసం టిల్లు స్క్వేర్ సెంటిమెంట్
Tillu Square అద్భుతమైన విజయం తర్వాత, సితార ఎంటర్టైన్మెంట్స్ 'MAD స్క్వేర్' ని ని సిద్ధం చేస్తున్నారు. ఇక ఇటీవల ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.మొదట్లో,MAD MAX అనేది టైటిల్,కానీ టిల్లు స్క్వేర్ విజయం తర్వాత ఈ చిత్రానికి MAD స్క్వేర్‌గా మార్చబడింది. ఇక 'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 'మ్యాడ్' కోసం పని చేసిన సాంకేతిక నిపుణులు 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు.
'టిల్లు స్క్వేర్' రచయితలలో ఒకరిగా కళ్యాణ్ శంకర్
'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్ మూవీ 'టిల్లు స్క్వేర్'కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్నారు.