LOADING...
Dhandoraa : శివాజీ-నవదీప్ 'దండోరా' టీజర్ రిలీజ్.. చావు, రాజకీయాలు, ఎమోషన్స్ కలిసిన గ్రామ కథ!

Dhandoraa : శివాజీ-నవదీప్ 'దండోరా' టీజర్ రిలీజ్.. చావు, రాజకీయాలు, ఎమోషన్స్ కలిసిన గ్రామ కథ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు చేరబోతున్న కొత్త చిత్రమే 'దండోరా'. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అడవిశేష్ ఈ మూవీలోని టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన 'దండోరా' టీజర్‌లో ఒక గ్రామంలో జరిగే అనేక కథలను కలిపి చూపించారు. సర్పంచ్ చుట్టూ తిరిగే రాజకీయ డ్రామా, సమాజంలో పరువుకోసం పోరాడే ఓ వేశ్య జీవితం, ఒక అందమైన ప్రేమకథ — ఇలా ప్రతీ పాత్రకీ ప్రత్యేకమైన భావోద్వేగాల్ని జోడించారు.

Details

కామెడీతో పాటు మరింత సీరియస్ టచ్

కథలో కీలక బిందువుగా నిలిచేది గ్రామంలో జరిగిన ఒక వ్యక్తి అనుమానాస్పద మరణం. ఆ మరణం తర్వాత గ్రామంలో చోటుచేసుకునే పరిణామాలు, ఆ సంఘటన వెనుక ఉన్న అసలు నిజం, ఆ ఘటన వలన గ్రామంలోని వారి జీవితాల్లో వచ్చే మార్పులు—ఇవన్నీ సినిమా ప్రధానంగా చూపించబోతుందనే సంకేతాలు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో 'బలగం' చిత్రంలో కూడా వ్యక్తి మరణానికి తర్వాత జరిగే విషయాలను చూపించినప్పటికీ, ఆ సినిమా కామెడీతో పాటు భావోద్వేగాలను కలిపి తీర్చిదిద్దారు. అయితే 'దండోరా' టీజర్ ద్వారా చూస్తే, ఇందులో కామెడీతో పాటు మరింత సీరియస్ టచ్ కనిపిస్తోంది.