
G2 : గూఢచారి-2 నుంచి ఆరు క్రేజీ స్టిల్స్ వచ్చేశాయ్
ఈ వార్తాకథనం ఏంటి
తన నైపుణ్యంతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో అడవి శేష్ నటిస్తోన్న 'గుఢచారి-2' కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
'గుఢచారి' రిలీజై ఆరేళ్లు పూర్తియైంది. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.
చిన్న చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.
తాజాగా 'గూఢచారి 2' ఆరు క్రేజీ స్టిల్స్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియోటర్లలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Details
మరోసారి ఏజెంట్ 115 గా కనిపించనున్న అడవి శేషు
పీఫుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి దర్శకుడిగా వినయ్ కుమార్ సిరిగినీడి వ్యవహరించాడు.
తాజాగా విడుదలైన స్టిల్స్‌లో అడవి శేష్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ కూడా కనిపించాడు.
ఈ సినిమాలో ఏజెంట్ 115 గా మరోసారి అడవి శేషు కనిపించనున్నారు.