
Kantara Chapter 1: ప్రమాదంలో ఆరుగురికి గాయాలు.. 'కాంతార చాప్టర్ 1' చిత్రీకరణ నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంతార: చాప్టర్ 1 సినిమా షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా సాగుతుండగా, సోమవారం అత్యవసర పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా సమాచారం ప్రకారం, ఆదివారం రాత్రి చిత్రబృందానికి జరిగిన ప్రమాదం దీనికి కారణమని తెలుస్తోంది.
చిత్రబృందంలోని 20 మంది సభ్యులు జడ్కల్‌లో షూటింగ్ పూర్తిచేసుకుని మినీ బస్సులో కొల్లూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
Details
వచ్చే ఏడాది అక్టోబర్ 2న రిలీజ్
జడ్కల్‌లోని మూడూరు ప్రాంతంలో షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఘటన జరిగిందని, ప్రస్తుతం క్షతగాత్రులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
రెండేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సినిమాకు ఇది ప్రీక్వెల్. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మాణం వహిస్తున్నారు.
కదంబుల కాలం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.