ఇండియన్ 2: ఎస్ జే సూర్యను ఢీ కొట్టనున్న కమల్ హాసన్?
ఈ వార్తాకథనం ఏంటి
విక్రమ్ సినిమాతో అదిరిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకున్న కమల్ హాసన్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇండియన్ 2 సినిమాలో ప్రధాన విలన్ గా ఎస్ జే సూర్య నటిస్తున్నాడని సమాచారం అందుతోంది.
ఎస్ జే సూర్య, కమల్ హాసన్ లపై కీలక ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయిందని చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నందుకు భారీగా పారితోషకం తీసుకుంటున్నాడట ఎస్ జే సూర్య.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలోనూ ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.
Details
సంక్రాంతి కానుకగా రిలీజ్
ఇండియన్ 2 సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది.
ఇండియన్ 2 షూటింగ్ పూర్తి కాగానే మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు కమల్ హాసన్.
ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో హీరో సిద్ధార్థ్, సముద్రఖని, బాబీసింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియంట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుభాస్కరన్ నిర్మాతగా ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.