SJ Surya : 'హనుమాన్' సినిమాలో ఛాన్స్ మిస్సైన ఎస్‌జే సూర్య.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరణ
ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వచ్చిన హనుమాన్ సినిమా ఈ ఏడాది కాసుల వర్షాన్ని కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని భారీ విజయాన్ని సాధించింది. తెలుగు భాషతో పాటు ఇతర భాషల్లోనూ అదిరిపోయే స్పందన లభించింది. త్వరలోనే హనుమాన్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నారు. హీరో నాని నటించిన 'సరిపోదా శనివారం' ఈవెంట్‌లో డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
నటుడిగా రాణిస్తున్న ఎస్ జె సూర్య
ఎస్ జె సూర్య అద్భుతమైన దర్శకుడు, నటుడు అని కొనియాడారు. తాను తీసిన హనుమాన్ మూవీలో ఓ పాత్ర కోసం ఎస్ జె సూర్యను అనుకున్నామని చెప్పారు. కానీ ఆయన రెమ్యునరేషన్ దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నామని ప్రశాంత్ వర్మ చెప్పారు. ఆ సినిమాలో ఏ పాత్రకు ఎస్ జె సూర్యను అనుకున్నారో మాత్రం క్లారిటీని ఇవ్వలేదు. ఇక హనుమాన్ మూవీలో వినయ్ రాయ్ విలన్ పాత్రలో కనిపించారు. మరోవైపు దర్శకుడిగా ఎన్నో హిట్స్ అందుకున్న సూర్య, కొంతకాలంగా నటుడిగా రాణిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు.