
Producer SKN : మరోసారి పెద్ద మనసు చూపిన SKN.. నటి తండ్రి కోసం సాయం!
ఈ వార్తాకథనం ఏంటి
నిర్మాత SKN ఇటీవల వరుస సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాలను సాధిస్తూ బిజీగా ఉన్నారు. అదనంగా సోషల్ మీడియా వేదికగా కూడా యాక్టివ్‌గా ఉంటారు. గతంలో అనేక మందికి సోషల్ మీడియా ద్వారా సాయం అందించడం ద్వారా గుర్తింపు పొందారు. కొద్దిరోజులుగా, జనసేన పార్టీ తరఫున కొన్ని సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తాజాగా నిర్మాత SKN మరో సాయం చేసి అందరికీ హృదయాన్ని జయించారు. అయితే ఆ సాయం గురించి ఆయన ఎప్పుడూ బయటకు చెప్పలేదని తెలుస్తోంది. ఇక నటి రేఖ భోజ్ (Rekha Bhoj) గురించి చెప్పాలంటే, పలు సినిమాల్లో చిన్న పాత్రలు, ఇండిపెండెంట్ సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్నారు.
Details
ఆర్థిక ఇబ్బుందుల్లో ఉన్నానని పోస్టు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేఖ, ఇటీవల తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను చూసిన నిర్మాత SKN, తక్షణమే రేఖ తండ్రి ఆరోగ్యానికి అవసరమైన ఆర్ధిక సహాయం అందించారు. ఈ సాయం ప్రసారం చేసుకోవడం SKNకు ఇష్టం లేక, ఆయన ద్వారా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నటి రేఖ భోజ్ మాత్రం సోషల్ మీడియాలో ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
Details
గొప్ప మనసు అని ప్రశంస
మా నాన్నగారికి సర్జరీ అవసరమని పోస్టు చేసిన తర్వాత, పరిచయం లేకున్నా అడగకుండానే ఒక తెలుగు నిర్మాత పెద్ద సహాయాన్ని అందించారు. మీ హెల్ప్ నాకు చాలా విలువైనది, సర్. థ్యాంక్స్ అండి అంటూ రేఖ కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేశారు. తాజాగా, టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆ సహాయం నిజంగా నిర్మాత SKN ఇచ్చారని బయటకు వచ్చింది. దీంతో మరోసారి నెటిజన్లు SKNను అభినందిస్తూ, ఆయన గొప్ప హృదయాన్ని ప్రశంసిస్తున్నారు.